నేను వైద్యం గురించి ఎప్పుడు ఏది రాసినా “నేను వైద్యుడిని కాను” అని ముందే చెప్పుకుంటాను. నేను రాస్తూన్నది శ్రుత పాండిత్యం; అంటే విన్నది. ఎక్కడ విన్నానంటారా? అమెరికాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో పని చేసే వైద్య నిపుణుల అభిప్రాయం ఇది. కనుక మూడొంతులు ఇది హితోపదేశమే కావచ్చు. వినండి చెబుతాను. వింటే విన్నారు కాని మీ వైద్యుడితో సంప్రదించకుండా సొంత వైద్యం మాత్రం చేసుకోకండి.
వైద్యులు ఏళ్లతరబడి చెవి కోసిన మేకలా అరిచేరు. ఏ వైద్యులు? మూడొంతులు జాన్స్ హాప్కిన్స్ వైద్యులే అయుంటారు. ఏమని అరిచేరు? "రసాయన వైద్యం (chemotherapy) ఒక్కటే కేన్సరు మీద రాంబాణంలా పని చేస్తుంది" అని వీరు సిద్ధాంతీకరించి, ఆ సిద్ధాంతం వినని వాళ్ళంతా మూర్ఖులు అని వాపోయేవారు. ఇప్పుడు వారేమంటున్నారు? రసాయన వైద్యం కంటె మంచి పద్దతులు ఇంకా ఉన్నాయని ఒప్పేసుకున్నారు. వీరు ఇలా ఒప్పేసుకుంటూన్న విషయాల సారాంశాన్ని ఈ కింద పొందు పరుస్తాను.
1. ప్రతీ వ్యక్తి శరీరంలోనూ కేన్సరు కణాలు ఉంటాయి. ఇవి కొన్ని కోట్ల (బిలియన్ల) మేరకి పెరిగే వరకు శరీరంలో అవి ఉన్నాయనే విషయాన్ని పసిగట్ట గలిగే పరీక్షలు మన దగ్గర లేవు. ఒక వైద్యుడు, "నీ శరీరంలో ఇహ కేన్సరు లేదు" అని భరోసా ఇచ్చేడంటే దాని అర్ధం ఏమిటంటే "నీ శరీరంలో కేన్సరు కణాలు ఇంకా ఏమయినా మిగిలి ఉన్నాయో లేవో చెప్పగలిగే స్థోమత ఉన్న పరీక్షా పరికరాలు నా దగ్గర లేవు" అని అన్వయం చెప్పుకోవాలి మనం.
2. జీవిత కాలంలో అయిదు నుండి పది సార్లు వరకు ఒక వ్యక్తి శరీరంలో కేన్సరు కణాలు పుట్టుకొస్తాయిట.
3. ఒక వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ (immune system) బాగా పని చేస్తూ ఉంటే ఇలా పుట్టుకొస్తూన్న కేన్సరు కణాలు వెంటవెంటనే హతమార్చబడుతూ ఉంటాయిట. కనుక అవి ముదిరి కేన్సరు కంతులుగా (tumors) మారే సావకాశం తక్కువట.
4. ఒక వ్యక్తికి కేన్సరు వచ్చిందంటే ఆ వ్యక్తి పోషణలో బహుముఖమైన కొరతలు ఏర్పడ్డాయని మనం తీర్మానం చెయ్యవచ్చునట. ఇక్కడ "బహుముఖ" అంటే జన్యు (genetic) సంబంధమైన కాని, పర్యావరణ (environmental) సంబంధమైన కాని, లేదా జీవనబాణీ (lifestyle) కి సంబంధించిన కారణాలు కాని అని మనం అన్వయం చెప్పుకోవచ్చు.
5. పోషణకి సంబంధించిన ఈ బహుముఖమైన కొరతలని అధిగమించి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచాలంటే మనం తినే అహారపదార్ధాల యెడల శ్రద్ధ వహించాలి; అవసరమైతే మార్చాలి. మనం తినే వస్తువులలో కొన్ని ముఖ్యమైన అంశాలని అవసరం వెంబడి చేర్చాలి. లేదా, పై రెండింటిని చెయ్యాలి.
6. “రసాయన చికిత్స” (chemotherapy) అంటే విష పదార్ధాలని ఉపయోగించి కేన్సరు కణాలని చంపడం. సాధారణంగా ఈ మందులని మాత్రల రూపంలో నోటితో తీసుకొనడం కాని లేదా నేరుగా రక్తం లోకి ఎక్కించడం కాని చేస్తారు. ఈ మందులకి విచక్షణ జ్ఞానం లేదు కనుక, సర్వసాధారణంగా, కేన్సరు కణాలతో పాటు ఆరోగ్యంగా ఉన్న కణాలని కూడ చంపడానికి ప్రయత్నం చేస్తాయి. అలా జరిగినప్పుడు ఆరోగ్యంగా ఉన్న శరీర అవయవాల కార్యక్రమానికి భంగం కలగొచ్చు.
7. పోనీ వికిరణ చికిత్స (radiation treatment) వాడదామా అంటే ఈ పద్ధతిలో కూడ ఆరోగ్యమైన కణాలు దెబ్బ తినే అవకాశం గట్టిగానే ఉంది.
8. వికిరణాలు వాడినా, రసాయన పదార్ధాలు వాడినా మొదట్లో కొంచెం గుణం కనిపిస్తుంది. క్రమేపీ ఆ గుణం కూడా కనబడకుండా పోతుంది. మొదట్లో గుణం కనిపిస్తోంది కదా అని రసాయన పద్ధతులు కానీ, వికిరణ పద్ధత్రులు కాని అలా వాడుతూ ఉంటే శరీరం విషపూరితం అవడం తప్ప మరొక ప్రయోజనం ఉండకపోవచ్చు.
9. రసాయన వైద్యం, వికిరణ వైద్యం వల్ల శరీరం లోని జీవకణాలలో ప్రతివర్తతలు (mutations) జరిగి రోగ స్వరూపమే మారిపోవచ్చు. అలా మార్పు చెందిన రోగానికి మనకి తెలిసిన రసాయనిక వైద్యం, వికిరణ వైద్యం గుణం చూపించకపోవచ్చు. పోనీ శస్త్ర చికిత్స మీద ఆధారపడదామా అంటే శస్త్రం వల్ల ఒక చోట వియుక్తంగా (isolated) ఉన్న రోగం శరీరం నలు మూలలకీ వ్యాపించే ప్రమాదం ఉంది.
10. మరయితే కేన్సరు కణాల మీద ప్రయోగించగల అస్త్రం ఏదయినా ఉందా? ప్రతి జీవికి బతకడానికి తిండి కావాలి కదా. ఆ పోషక పదార్ధాలు కేన్సరు కణాలకి అందకుండా చేస్తే అవి మలమల మాడి చస్తాయి కదా.
11. పోషక పదార్ధాలలో ముఖ్యమయినది చక్కెర. ఆ చక్కెర కేన్సరు కణాలకి అందకుండా చేస్తే? ఈ రోజులలో చక్కెర స్థానంలో వాడటానికి Aspertame వంటి సంధాన చక్కెరలు (synthetic sugars) వస్తున్నాయి కాని వాటి కంటె సహజసిద్ధమైన తీపి పదార్ధాలని (అంటే తేనె, బెల్లం, ఇక్షుసారం (molasses), వగైరాలు) మోతాదు మించకుండా వాడడమే శ్రేయస్కరం.
12. పాలు మంచి పోషక పదార్ధం అని మనందరికీ తెలుసు. ఈ పాలంటే కేన్సరు కణాలకీ కూడా ఇష్టమేనట. పైపెచ్చు పాలు కఫజని; అంటే కఫాన్ని పుట్టిస్తుందిట. కేన్సరు పెరగడానికి ఈ అమత్వం (mucus) సహాయపడుతూందిట. కనుక పాలు తాగడానికి బదులు ఏ సోయా పాలో తాగడం మంచిది అని వీరు అంటున్నారు.
13. కేన్సరు కణాలు ఆమ్ల వాతావరణంలో బాగా పెరుగుతాయిట. మాంసాహారం కడుపులో ఆమ్ల వాతావరణాన్ని సృష్టిస్తుందిట. కనుక మాంసం (అంటే ఆవు మాంసం, మేక మాంసం, పంది మాంసం, వగైరాలు) స్థానంలో ఏ చేపలో, కోడినో తినడం మంచిదిట. ఈ రోజులలో జంతువులని, కోళ్ళని, చేపలని కూడ కృత్రిమ వాతావరణంలో రసాయన “ఎరువులు” వేసి పెంచుతున్నారు కనుక వాటి “మాంసం” రసాయనాలతో కలుషితం అవుతున్నాదనేది నిజం. ఈ పద్ధతిలో ఆలోచించే నాకు తెలుసున్న మాంసాహారులు ఎందరో స్వచ్చందంగా శాకాహారులయిపోయేరు.
14. ఈ రోజుల్లో కాయగూరలు, పండ్లు, దినుసులు తినడం ఫేషన్ అయిపోయింది.
15. గలన జలం (లేదా వడకట్టిన నీళ్ళు, లేదా filtered water) శ్రేష్టం. అలాగని స్విన్న జలం (లేదా బట్టీపట్టిన నీళ్ళు, లేదా distilled water) తాగకండి; ఎందుకంటే స్వేదన జలం కొద్దిగా ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటుంది.
16. ఈ రోజుల్లో ప్లేస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దానితోపాటు మైక్రోవేవ్ అవెన్లు భారతదేశంలో కూడ వచ్చెస్తున్నాయి. ఈ ప్లేస్టిక్ బొచ్చెలని మైక్రోవేవ్ అవెన్‌లో పెట్టి వేడి చేసి తినడం మంచిది కాదని అంటున్నారు. అలాగే ప్లేస్టిక్‌తో చేసిన నీళ్ళ సీసాలని ఫ్రీజర్‌లో (రెఫ్రిజిరేటర్‌లో కాదు, ఫ్రీజర్ లో) పెట్టినా మంచిది కాదుట. ఈ రెండు సందర్భాలలోనూ డయాక్సిన్ (dioxin) అనే రసాయనాలు విడుదల అవుతాయిట. ఈ రసాయనాలు కూడ కేన్సరు పుట్టి పెరగడానికి దోహదపడతాయిట.
అయ్యా, టుకీగా చెప్పాలంటే ప్రకృతికి దగ్గరగా, కృత్రిమ జీవితానికి దూరంగా బతకడం నేర్చుకొండి. బాగుపడతారు.
Friday, January 15, 2010
Subscribe to:
Post Comments (Atom)
చాల బాగుంది. చక్కగా వ్రాసారు.
ReplyDeleteమీ వ్యాసం బావుంది.
ReplyDeleteకాన్సర్ మీద తెలుగులో మరిన్ని వ్యాసాలు బ్లాగుల్లో వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కాన్సర్ రావడానికి ముఖ్యంగా చెప్పే కారణాలు:
1.పుగాకు వాడకం
2.అధిక బరువు
ప్రతిరోజూ పట్టుదలగా 30 నిమిషాలు వ్యాయామం చేస్తూ, పోషక విలువలున్న ఆహారం తీసుకుంటూ, ధురభ్యాసాల జోలికి పోనివారిలో, మంచి ఫలితాలే వస్తున్నాయంటున్నారు.
-ప్రసాద్
useful information
ReplyDeleteచాల బాగుంది.
ReplyDeleteచాలా అరుదయిన సమాచారం. చివరి రెండు ముక్కలూ చాలా ఉపయుక్తంగా ఉన్నాయి.
ReplyDelete'అయ్యా, టుకీగా చెప్పాలంటే ప్రకృతికి దగ్గరగా, కృత్రిమ జీవితానికి దూరంగా బతకడం నేర్చుకొండి. బాగుపడతారు.'
ReplyDeleteమిగతా విషయాలు తెలీదు కాని, దీనితో మాత్రం నేను ఏకీభవిస్తాను :)