Tuesday, January 20, 2009

భారతీయ లెక్కింపు పద్ధతి-2

మాచిరాజు సావిత్రి పెరటి దారిన పిలచి అసలు పెద్ద పెద్ద సంఖ్యలని భారతీయ పద్ధతిలో ఏయే పేర్లతో పిలుస్తారని అడిగేరు. అందుకని ఆ పేర్లు అన్ని ఇక్కడ ఇస్తున్నాను. (కుండలీకరణాలలో సంస్కృతం పేరు కాని, ఇంగ్లీషు/లేటిన్ పేరు కాని కూడ ఇచ్చేను.)

ఈ దిగువ పేర్లని చదివేటప్పుడు వాటి బాణీని గమనించండి. ఈ బాణీ ప్రకారం "పది కోట్లు" తరువాత "వంద కోట్లు" అనకుండా కొత్త పేరు రావాలి, కాని రాలేదు. మాటవరసకి "వంద కోట్లు" ని నిఖర్వం అందాం. అప్పుడు పది కోట్లు, నిఖర్వం, పది నిఖర్వాలు, అర్బుదం, మహార్బుదం (అంటే పది అర్బుదాలన్నమాట. పదే పదే "పది" అన్న పూర్వ ప్రత్యయం చేర్చుతూ ఉంటే బాగుండదని "పది" కి బదులు "మాహా" వాడినట్లున్నారు.), వగైరా పేర్లు వస్తాయి. ఈ "మహా" తో మహానిధి వరకు వెళ్ళి అక్కడ నుండి ఒక క్రమం అంటూ ఏదీ లేకుండా ఏవేవో పేర్లు వస్తాయి.

1 = 100 = ఒకటి

10 = 101 = పది

100 = 102 = వంద (నూరు)

1000 = 103 = వెయ్యి (సహస్రం)

10,000 = 104 = పది వేలు (అయుతం)

1,00,000 = 105 = లక్ష (వంద వేలు, నియుతం)

10,00,000 = 106 = పది లక్షలు (ప్రయుతం, మిలియను)

1,00,00,000 = 107 = కోటి (పది మిలియనులు)

10,00,00,000 = 108 = పది కోట్లు (వంద మిలియనులు)

100,00,00,000 = 109 = వంద కోట్లు (బిలియను)- కొత్త పేరు కావాలి

10,00,00,00,000 = 1010 = వెయ్యి కోట్లు (పది బిలియనులు)

1,00,00,00,00,000 =1011 = పది వేల కోట్లు (అర్బుదం, వంద బిలియనులు)


1012 = మహార్బుదం (ట్రిలియను)


1013 = ఖర్వం (పది ట్రిలియనులు)

1014 = మహా ఖర్వం (వంద ట్రిలియనులు)


1015 = పద్మం (క్వాడ్రిలియను)


1016 = మహా పద్మం (పది క్వాడ్రిలియనులు)

1017 = క్షోణి (వంద క్వాడ్రిలియనులు)


1018 = మహా క్షోణి (క్వింటిలియను)


1019 = శంఖం (పది క్వింటిలియనులు)


1020 = మహా శంఖం (వంద క్వింటిలియనులు)


1021 = క్షితి (సెక్స్టిలియను)


1022 = మహా క్షితి (పది సెక్స్టిలియను)


1023 = క్షోభం (వంద సెక్స్టిలియనులు)


1024 = మహా క్షోభం (సెప్టిలియను)


1025 = నిధి (పది సెప్టిలియనులు)


1026 = మహా నిధి (వంద సెప్టిలియనులు)


1027 = పర్వతం (ఆక్టిలియను)


1028 = పరార్ధం (పది ఆక్టిలియనులు)


1029 = అనంతం (వంద ఆక్టిలియనులు)


1030 = సాగరం (నొనిలియను)


1031 = అవ్యయం (పది నొనిలియనులు)


1032 = అచింత్యం (వంద నొనిలియనులు)

1033 = అమేయం ()


1034 = ?? ()


1035 = భూరి ()


1036 = మహా భూరి ()


1037 = వృందం ()


1038 = మహా వృందం

??
1050 = సముద్రం

1055 = మహౌఘం

రావణాసురుడి సైన్యం ఒక మహౌఘం అని వాల్మీకి అంటాడు కనుక ఈ పేర్లు పూర్వం వాడుకలో ఉన్నట్లే మనం అనుకోవాలి.

2 comments:

  1. వేమూరిగారూ, ముందుగా మీకు నా నమస్కారాలు.

    "సుజనరంజని" లో అనుకుంటాను మీరు రాసే అమెరికా విశేషాలు చాలా ఆసక్తిగా చదివేవాడిని అప్పట్లో.

    "భూరి విరాళం" అనే పదానికి, మీరు చెప్పిన "భూరి" అనేపదానికి సంబంధం ఉందనుకుటున్నా..

    ఆసక్తి కొద్దీ అడుగుతున్నాను, భారతం లో ఉదహరించిన "అక్షౌహిణి" అంటే ఎంతో మరి?

    అక్షౌహిణి మీరు చెప్పిన క్షోణి ఒకటేనా?

    ReplyDelete
  2. అక్షౌహిణి అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 కాలి భటులు ఉన్న సైన్యం. కనుక క్షోణి అన్నా అక్షౌహిణి అన్నా ఒకటి కాదనే అర్ధం అవుతున్నాది.

    ReplyDelete