Friday, September 30, 2016

ఫెర్మా చివరి సిద్దాంతం 

గణిత శాస్త్రంలో ఫెర్మా చివరి సిద్దాంతం దరిదాపు 350 సంవత్సరాలబట్టి పరిష్కారం లేకుండా ఉండిపోయిన గడ్డు సమస్య. ఎందరో మహానుభావులు ప్రయత్నం చేసి విఫలులయేరు. చివరికి నలుగురు సాయం పట్టి ఈ గడ్డు సమస్యని గట్టుకి చేర్చేరు. ఇదెలా జరిగిందో ఆ కథ కమామీషూ ఒక పెద్ద వ్యాసం రూపంలో రాసి ఈమాట జాలపత్రికలో ప్రచురించేను. దానిని కినిగే ప్రచురణ సంస్థ (kinige.net) ఇ-పుస్తక రూపంలో ప్రచురించి, ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

ఈమాట జాలపత్రికలో ప్రచురణ పొందిన ఈ వ్యాసంలో అక్కడక్కడ కనిపించిన అచ్చు తప్పులు సరిదిద్ది, పాఠక మహాశయులు అభిప్రాయాలని లెక్కలోకి తీసుకుని మరికొన్ని మార్పులు, చేర్పులు చేసి, నా సంతృప్తి కోసం ఒక నఖ చిత్రంలా ఋజువుని ఇంగ్లీషులో కూడ రాసి, ఒక పుస్తకం రూపంలో ప్రచురించేను. ఈ దిగువ ఇచ్చిన కినిగె లంకె నుండి ఈ పుస్తకాన్ని ఉచితంగా దింపుకోవచ్చు!

నమస్కారం
వేమూరి వేంకటేశ్వరరావు


1 comment: